ELR: పెదపాడు మండలం కోనికి గ్రామంలో ఎస్సై ఆర్. శ్రీనివాస్, సిబ్బంది ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేర రహిత సమాజమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పోలీసులు ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దిశా యాప్, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, డ్రగ్స్ వంటి వాటిపై అవగాహన కల్పించారు.