WNP: గోపాల్ పేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం ఎస్సై శశిధర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్సై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. కార్య క్రమంలో కానిస్టేబుళ్లు పరంధాములు, శ్రీను, తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.