GNTR: దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెనాలిలో ప్రజాసంఘాల నాయకులు, బాధిత రైతులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎన్జీవో హోంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ప్రమాదంలో వంద కోట్ల నష్టం జరిగిందని, ప్రభుత్వం క్వింటాల్ కు రూ.7000 నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు.