KRNL: పెద్దకడబూరు మండలం నౌలేకల్ గ్రామంలో రైతులకు ఈ- పట్టాదారు పాసు పుస్తకాలను MRO వలిబాషా పంపిణీ చేశారు. భూ రికార్డుల నిర్వహణలో ఈ- పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను సక్రమంగా పరిశీలించి అవసరమైన సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రైతులు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.