అనంతపురం: తెలంగాణ రాష్ట్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని గుంతకల్లు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మణికంఠ పేర్కొన్నారు. గుత్తి R&Bలో ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని, ఆయన ఆశయాలను గౌరవిస్తున్నామన్నారు. ఆయనపై ఎక్కడైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు, తగిన రీతిలో బుద్ధి చెప్తామన్నారు.