సంగారెడ్డిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మంత్రి దామోదర రాజనర్సింహ స్వయం సహాయ సంఘాల మహిళలకు రూ.69.19 కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం ఉపాధితో అభివృద్ధి సాధించాలని, ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.