MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకుల ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పాల్గొన్నారు.