SRD: సిర్గాపూర్ నుంచి నారాయణఖేడ్ వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని మంగళవారం తహశీల్దార్ కిరణ్ కుమార్‌కు కోరుతూ BRS నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఏళ్లు గడుస్తున్నా సదరు గుత్తేదారు బీటి రోడ్డు నిర్మాణం పనులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.