TG: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ములుగు కలెక్టరేట్లో మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్లతో కలిసి మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆమె అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.