WGL: వర్ధన్నపేటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. MLA మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది ఎన్నో ఏళ్ల ఉద్యమాలు, త్యాగాలు, ఆకాంక్షలు, అమరవీరుల బలిదానాల ఫలితమని, అమరవీరుల త్యాగాలను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువదని అన్నారు.