కోనసీమ: కొత్తపేట మండలం గంటి గ్రామానికి చెందిన చామకూరి హనుమంతరావు ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం నాగమ్మ తల్లి రోడ్డులోని పని ప్రదేశానికి వచ్చారు. హాజరు నమోదు కోసం ఫోటో తీసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే స్పందించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వారు తెలిపారు.