KMM: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మధిర పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ లింగాల కమల్ రాజు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కమల్ రాజు నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.