WGL: వరంగల్ ఖుషి మహల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా అభివృద్ధి సందేశాన్ని వివరించారు. కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డీసీపీ అంకిత్ కుమార్తో కలిసి ఆమె అమరవీరులకు నివాళులర్పించారు.అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా,వివిధ శాఖల ఆధ్వర్యంలో అసెట్స్ పంపిణీ చేశారు.