TPT: శ్రీకాళహస్తి బంగారమ్మ కాలనీలో నిన్న రాత్రి దొంగతనం జరిగిందని స్థానికులు అన్నారు. జ్యోతి అనే మహిళ కాలనీలోని 3వ వీధిలో నివాసం ఉంటుందన్నారు. ఢిల్లీలో ఉన్న ఆమె కుమారుడు వద్దకు వెళ్లిందన్నారు. పక్క వీధిలో ఉంటున్న ఆమె కుమార్తె జ్యోతి ఇవాళ ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి ఉండడాన్ని గమనించింది. 2 కేజీల వెండి, 3.5 సవర్ల బంగారం,రూ. 48 వేలు చోరీకి గురైందని తెలిపారు.