అన్నమయ్య: జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచిందని పీడీ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఉదయం సర్వర్ సమస్యలు, వేలిముద్రలు, ఐరిస్ ధృవీకరణలో జాప్యం కారణంగా పంపిణీ ఆలస్యమైనప్పటికీ, మధ్యాహ్నం తర్వాత సర్వర్ సక్రమంగా పనిచేయడంతో వేగంగా నగదు అందజేశారు. రాత్రి 7.45 గంటల వరకు 1,87,611 పింఛన్లలో 1,68,308 మందికి పంపిణీ పూర్తి చేసినట్లు వెల్లడించారు.