KNR: తెలంగాణ విద్యా పరిరక్షణ చొప్పదండి మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్నకొండ హై స్కూల్లో ప్రభుత్వం విద్య పటిష్టత, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూన్ 5న హైదరాబాద్లో నిర్వహించే ర్యాలీ పోస్టర్ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ కానిగంటి రాజమౌళి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవడం అందరి బాధ్యత అన్నారు. ర్యాలీ విజయవంతం చేయాలని కోరారు.