అనకాపల్లిలో మంగళవారం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే పోస్టర్లను వైసీపీ నేతలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఎన్నో హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు హామీలు మరిచి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని, జగన్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.