SRCL: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బీ గితేతో కలిసి అటవీ, పోలీస్, డీఆర్డీవో, పౌర సంబంధాల శాఖల స్టాళ్లను సందర్శించారు.