TG: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన సాగుతోందని పేర్కొన్నారు. మిగిలిన రెండున్నరేళ్లు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తామని, ప్రజలను బీజేపీ మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.