BDK: ప్రభుత్వ క్యాంప్ ఆఫీస్, సింగరేణి క్యాంప్ కార్యాలయాలలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరుల ప్రాణ త్యాగాలకు చలించి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల కల, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ఆయన అన్నారు.