కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మంగళవారం కొండాపురం మండలంలోని తాళ్ల పొద్దుటూరు, కొండాపురం గ్రామాల్లో పర్యటనకు రానున్నారు. ఆయనతోపాటు MLA ఆదినారాయణరెడ్డి ఇరువురు తాళ్ల పొద్దుటూరు హై స్కూలు పరిశీలిస్తారు. కొండాపురంలో స్కిల్ సెంటర్ ఏర్పాటుకు రానున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. అయితే కలెక్టర్ ముంపు బాధితుల సమస్యలపై కూడా దృష్టి పెట్టాలని కోరారు.