HNK: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల పట్టణంలోని MLA క్యాంపు కార్యాలయం, అమరధామంలో MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతం, తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.