ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ HYDలో తలపెట్టిన సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఏపీ బీజేపీ సీనియర్ నేత విష్ణువర్థన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీ హాల్లో సమావేశం నిర్వహిస్తే అభ్యంతరం ఎందుకు? అని ప్రశ్నించారు. జనసేన క్రియాశీల కార్యకర్తల సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడం ప్రజస్వామ్య హక్కులను హరించడమేనని విమర్శించారు.