W.G: ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యర్ధాలను బహిరంగంగా ఆసుపత్రి ఆవరణలోనే నిల్వ చేస్తున్నారు. తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉత్పత్తి అవుతున్న అత్యంత ప్రమాదకరమైన వ్యర్థాల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద అంబులెన్స్ షెడ్డు అనుకుని వీటిని నిల్వ చేస్తుండడంతో ఈ ప్రాంతం దుర్ఘంధంగా మారింది.