NRPT: నర్వ మండలం పాతర్చేడ్ గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను, బెటర్మెంట్, డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో అదనపు భారం మోపుతున్నారని ఎస్ఎఫ్ఎ జిల్లా ఉపాధ్యక్షుడు కే.యం మహేందర్ ఆరోపించారు. కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశాల మేరకు డీపీవోకు వినతిపత్రం అందజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మహేశ్ వర్మ పాల్గొన్నారు.