CTR: విద్యార్థులను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఉపాధ్యాయులు కోరారు. వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లంలో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ బడులలో ఉత్తమ ఫలితాలు నమోదు అవుతున్నాయని వారు వెల్లడించారు. విద్యార్థులకు ప్రభుత్వం పలు సౌకర్యాలను కల్పిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.