సిరిసిల్ల పట్టణంలోని సహస్ర జూనియర్ కళాశాలలో ఇవాళ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సిద్ధిరాల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారులు చేసిన త్యాగాలు, పోరాటాలతో ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని ఆయన కొనియాడారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.