JN: జనగామలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రభుత్వ విప్ ఐలయ్య పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రభుత్వ విప్ ఐలయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాళులర్పించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థినిలు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.