TG: బీజేపీ సహకారం వల్లే తెలంగాణ ఏర్పడిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. స్వరాష్ట్రం సాధనకు BJP పోరాటం చేసిందన్నారు. KCR దొంగ దీక్షలు చేస్తే.. BJP గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడిందని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ పాలన కలెక్షన్లు.. కమీషన్ల మీదే నడుస్తోందని ఆరోపించారు. రేవంత్ పాలనపై రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నారని, పాలన చేతగాక.. కేంద్రాన్ని విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.