నారాయణపేట జిల్లా కేంద్రంలో గాలిదుమారానికి మంగళవారం హైదరాబాద్ రోడ్డులోని ఓ కాంప్లెక్స్‌పై ఏర్పాటు చేసిన అడ్వర్టైజ్మెంట్ హార్డింగ్ కూలింది. గాలి ఒత్తిడికి తట్టుకోలేక హార్డింగ్ బిల్డింగ్‌పై పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డుపై పడితే ప్రమాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణం నాసిరకంగా చేపట్టడంతోనే పడిందని స్థానికులు చెప్పారు.