BDK: భద్రాచలం భద్రగిరి మార్ట్‌లో పాఠశాల నోట్ బుక్స్‌తో పాటు జామెట్రీ బాక్సులు, స్కూల్ బ్యాగులు తదితర విద్యాసంబంధిత వస్తువులను తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నాణ్యమైన వస్తువులు లభించే మార్ట్‌ను ప్రోత్సహించి, దాని అభివృద్ధికి సహకరించాలని కోరారు.