MDK: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిన్నశంకరంపేటలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళులర్పించారు. తెలంగాణ కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరుల సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అమరవీరుల ఆశయాల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.