MHBD: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మలిదశ ఉద్యమంలో సంచలనం సృష్టించిన మణుగూరు ప్యాసింజర్ దహనం ఘటన మరోసారి గుర్తుకు వచ్చింది. 2011 ఫిబ్రవరి 23న తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చేపట్టిన బంద్ సందర్భంగా కేసముద్రం మండలం రంగాపురంలో గుర్తు తెలియని వ్యక్తులు రైలును ఆపి రెండు బోగీలకు నిప్పంటించారు. ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది.