12వ తరగతి రిజల్ట్స్ వెరిఫికేషన్, రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు CBSE ప్రకటించింది. ఈ పోర్టల్ మే 29న తెరుచుకోవాల్సి ఉండగా, జూన్ 1వ తేదీకి వాయిదా వేశారు. నిన్న కూడా ఓపెన్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. సమస్యలుంటే 1800118004 నంబర్‌ను సంప్రదించాలి.