SRPT: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసులకు అరుదైన గుర్తింపు దక్కింది. అదనపు ఎస్పీ యు. రవీందర్ రెడ్డి ఉత్తమ సేవా పతకాన్ని అందుకోగా, ఏఎస్సైలు వెంకన్న, కానిస్టేబుళ్లు శ్రీధర్, కృష్ణయ్య, మధుమోహన్లు సేవా పతకాలు సాధించారు. సిబ్బందిని అభినందించిన ఎస్పీ నరసింహ, నిబద్ధతతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.