ADB: సోనాల మండల కేంద్రంలోని పసుపుల లక్ష్మీ శంకర్ అనే లబ్ధిదారురాలి గృహప్రవేశంను మంగళవారం స్థానిక ఎమ్మార్వో మల్లేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిందుజ సుధీర్ రెడ్డి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.