MBNR: జిల్లాలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిర్మూలనకు అటవీ శాఖ రూపొందించిన అవగాహన పోస్టర్ను కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా జూట్ సంచులు, స్టీల్ బాటిళ్లు వంటి పర్యావరణహిత వస్తువులను వాడాలని కోరారు.