MDK: తూప్రాన్ మండలంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్ పర్సన్ రజని రాఘవేందర్ గౌడ్, రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద ఆర్డిఓ జై చంద్రారెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు.