KDP: జమ్మలమడుగు-తాడిపత్రి ప్రధాన రహదారిలోని కర్మలవారిపల్లె వద్ద సోమవారం సాయంత్రం మైలవరం SI శ్యామ్ సుందర్ రెడ్డి వాహనదారులకు ట్రాఫిక్ పై అవగాహన నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి చెల్లుబాటు అయ్యే పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.