BPT: ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు బాపట్ల జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఎస్పీ ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో సోమవారం ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ కార్యక్రమం ప్రారంభమైంది. బాపట్ల టౌన్, రూరల్, వెదుళ్లపల్లి, కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.