ప్రకాశం: మార్కాపురం జిల్లా పొదిలి మండలం పోతవరం గ్రామంలో ఓ స్మశాన వాటిక స్థలంపై రెండు వర్గాలు గొడవపడ్డ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. ఘటనలో ఇద్దరికీ గాయాలు కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రిక తరలించారు. వివాదంపై కలెక్టర్ని కలిసి న్యాయం చేయమని కోరుతామని ఇరు వర్గాల వారు తెలిపారు.