TG: ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వం తమది అని సీఎం రేవంత్ అన్నారు. ‘2047 విధాన పత్రంలో రైతులకు ప్రాధాన్యత ఇచ్చాం. రైతులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో 2.36 కోట్ల టన్నుల పంట దిగుబడులు వచ్చాయి. రైతుల అప్పు భారాన్ని తగ్గించేందుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. 25 లక్షల రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం’ అని అన్నారు.