HNK: తెలంగాణ గాంధీగా గుర్తింపు పొందిన భూపతి కృష్ణమూర్తి ఉద్యమాల కోసం 600 ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు. ముల్కనూరులో జన్మించిన ఆయన, వారసత్వ భూమిని స్వాతంత్య్ర, తెలంగాణ ఉద్యమాలకు కేటాయించారు. గతంలో పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ వరంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని టికెట్లు ఇచ్చినా తృణప్రాయంగా వదులుకున్నారని,ఆయన నిస్వార్థ సేవలు మరవలేనివని స్మరించుకున్నారు.