TPT: DV సత్రం మండలం తనయాలి వద్ద మాంబట్టు సెజ్ అపాచీ పరిశ్రమ కార్మికులతో వెళ్తున్న బస్సు టైరు అకస్మాత్తుగా పేలిపోవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గోడను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రసాద్ (48) తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బస్సులో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికలు తెలిపారు.