MNCL: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద MP గడ్డం వంశీకృష్ణ మంగళవారం అమరవీరులకు నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి వారి త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.