ELR: చింతలపూడిలో పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారులు సీరియస్ అయ్యారు. నిబంధనలు అతిక్రమించి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో రేషన్ డీలర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. గతంలో పట్టుబడిన వారిని బైండోవర్ చేశారు.