తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపదతో పాటు, కష్టపడి పనిచేసే తత్వం ఉన్న ప్రజలతో విరాజిల్లుతోందని ప్రశంసించారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు పలువురు రాజకీయ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.