మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ త్యాగాల ఫలితంగానే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.