CTR: మురుగు కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పుంగనూరు పట్టణం విద్యుత్ కార్యాలయం ఎదుట జరిగింది. మంగళవారం అటుగా వెళుతున్న స్థానికులు చూసి మృతదేహాన్ని కాలువలో నుంచి వెలికి తీశారు. మృతుడు మేలుపట్లకు చెందిన సుధాకర్ (65) గా గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.