JN: జనగామ పట్టణంలో మహిళా ఉద్యోగి ఫొటోలను అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్టు చేసి అవమానకర వ్యాఖ్యలు చేసిన ఘటనలో జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న విజయ్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు డిజిటల్ ఆధారాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.